” నేటిసాక్షి, మిర్యాలగూడ : దివంగత మహానేత, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ధీరావాత్ రాగ్య నాయక్ 24వ వర్ధంతి వేడుకలు సోమవారం కుటుంబ సభ్యులు, అభిమాలు, వివిధ పార్టీల నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో బస్ స్టాండ్ ఆవరణలో గల వారి విగ్రహానికిఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ, చీఫ్ విప్ భారతీ రాగ్య నాయక్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కైలాబ్ నాయక్, వివిధ పార్టీల నాయకులు, కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తల, వివిధ కుల సంఘాల నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా ఈ జిల్లాలో కాంగ్రేస్ పార్టీకి, బడుగుబలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజల పక్షాన నిలిచిన నేతగా పేరొందినారని, దేవరకొండ ఎమ్మెల్యే గా, ఈ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు, ఈ ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి హయంలో 12కు 12 అసెంబ్లీ స్థానాలను గెలిపించుకున్నారని వారి సేవలను కొనియాడారు. .వారు నేటికి లేని లోటు ఎవరు తీర్చలేరని, వారిని హతమార్చిన మావోయిస్టులు సైతం ఇంతటి మహోన్నత నేతను కాల్చినందుకు చివరికి క్షమాపణలు చెప్పిన దుస్థితి ఎక్కడ జరగలేదని, కాబట్టి నూతనంగా ప్రజా ప్రతినిధులుగా బాధ్యత తీసుకున్న వారంతా వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిరుమరి కృష్ణయ్య, రామలింగయ్య, చిలుకూరి బాలు, పొదిల శ్రీనివాస్, మాజీ ఎంపిపి నందిని రవితేజ, మహమ్మద్ అలీ, నర్సిరెడ్డి, బెజ్జం సాయి, శౌరి, బాలాజీ నాయక్, చిట్టిబాబు, భాషా నాయక్, మాన్య నాయక్, లింగ నాయక్, సైదా నాయక్, గాజుల శ్రీను, మాలి కాంతారెడ్డి, తగలకొప్పుల సైదులు, సర్పంచ్లు శ్రీహరి, దశ్య, లింగ స్వామి, రమణ, గోపాల్, రమేష్, తులసిరాం, లాలా, కిరణ్, శంకర్, శ్రీనివాస్ రెడ్డి, ఇందిర గిరిబాబు, రాము నాయక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

