నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలంలోని బోతలపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద “నేల ఆరోగ్యం మరియు సారవంతం” అనే అంశంపై సోమవారం మండల వ్యవసాయ శాఖ అధికారి రుషేంద్ర మణి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి, పంటకి ఎంత మోతాదులో పోషకాలు అవసరం అవుతాయో మరియు నెలలో ఎ పోషకాలు ఎంత మోతాదు లో ఉన్నాయో మరియు పంటకి ఎంత అవసరం మేరకు వాడాలో తెలుసుకోవడానికి మట్టి నమూనా మరియు టెస్టింగ్ విధానం ఉపయోగపడుతుందని, దాని కోసం మట్టి నమూనా సేకరించడం మరియు టెస్టింగ్ గురించి మరియు సాయిల్ హెల్త్ కార్డ్ మొబైల్ యాప్‌ను ఉపయోగించడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు ఏఈఓలు పార్వతి, ప్రియాంక, సైదులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

