నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29సిర్పూర్ (టి) మండలం లక్ష్మిపూర్ గ్రామంలో సర్వే నం.47లోని 14.08 ఎకరాల భూమి వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. భూ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు నిబంధనల ప్రకారం సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.భూ యజమానుల రికార్డులు, గత రిజిస్ట్రేషన్లు, హక్కుల బదలాయింపులు పరిశీలించి అక్రమాలు తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తహసీల్దార్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు.ఇదే సందర్భంగా ప్రజావాణిలో పాల్గొన్న భూ బాధితులు సాన మల్లయ్య పేరా ఉషలు, తమ భూమిని అక్రమంగా ఇతరుల పేర్లపై నమోదు చేశారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని అధికారులను కోరారు.

