Wednesday, January 21, 2026

నాడు నందమూరి తారకరామారావు కు చంద్రబాబు వెన్నుపోటు. నేడు అన్నమయ్య జిల్లాకు వెన్నుపోటు..ఇదే బాబు నైజం..ఇక ఎన్ని రోజులు మీ వెన్నుపోట్లు..ఆర్. శ్యామల

నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా :-: రాష్ట్ర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి పండుగ శుభాకాంక్షలని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ శ్యామల అన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఆలయానికి వెళ్లి స్వామివారిని వేడుకొని వచ్చానని అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు చేసేటువంటి బుద్ధి మార్చాలని ఆ దేవదేవుడిని ప్రార్థించానని శ్యామల తెలిపారు. ఆనాడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత స్వర్గీయ నందమూరి తారకరామారావు కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆయన వెన్నుపోటు అనేది ఇలా ఆచారంగా కొనసాగిస్తున్నారని ఆయన మనకు ఉండటం గ్రహ పాటు అని శ్యామల అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మనసు మార్చుకుని జిల్లా కేంద్రంగా రాయచోటి నే కొనసాగించాలని రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగిస్తే ఆ ప్రాంత ప్రజల్లో కొద్దో గొప్పో విశ్వాసముంటుందని శ్యామల పేర్కొన్నారు. ఎన్నికలకు రెండు నెలలకు ముందు కూడా రాయచోటి ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని జిల్లా కేంద్రంగా రాయచోటినే కొనసాగిస్తానని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు నేడు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదని శ్యామల ప్రశ్నించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ ప్రాంతానికే చెందినవారైనప్పటికీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని ఆపడం ఆయన తరం కాదా అంటూ శ్యామల ప్రశ్నించారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశానంతరం బయటొచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు కారుస్తూ మీడియా సమావేశంలో మాట్లాడకుండా దాటేయడం ఇక ఏమి చేయలేక పోయానని ఏమి మాట్లాడలేనని తన వాహనంలో వెళ్లిపోయారు. కొద్దిసేపటికి చంద్రబాబు ప్రకటన చేస్తూ విధి లేని పరిస్థితిలో రాయచోటి కేంద్రాన్నిమార్చవలసొచ్చిందని రాయచోటికి అన్యాయం చేయనని అన్ని విధాల రాయచోటిని అభివృద్ధి చేసి చూపెడతానని రాయచోటికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తానని ప్రకటించిన నేపథ్యంలో శ్యామల చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపడుతూ పులివెందులలో ఉన్న మెడికల్ కాలేజీని అమ్మకానికి పెట్టిన మీరు రాయచోటికి మెడికల్ కాలేజ్ ఎలా తీసుకొస్తారని నమ్మేవాళ్లు వెర్రి వాళ్ళయితే చెప్పేవాళ్లు చంద్రబాబు అని శ్యామల ఎద్దేవ చేశారు. ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు. ఇక ఎన్ని రోజులు మీ వెన్నుపోటు భరించాలి. మీ అబద్దపు మాటలతో ఇక ఎన్ని రోజులు నమ్మిస్తారు. రాయచోటి అన్నింటికి దరిదాపులో ఉంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలను శ్యామల వినిపిస్తూ రాయచోటి జిల్లాగా మారిస్తే రాజీనామా చేసి మీసం తీసేస్తానని తొడగొట్టారు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా ప్రాంతంగా ఉన్న రాయచోటి మరొక కేంద్రంగా మారబోతుంది. మీరు మంత్రిగా ఎప్పుడు రాజీనామా చేస్తారు. ఎప్పుడు మీసం తీస్తారని శ్యామల ప్రశ్నించారు. ——————————————–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News