మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలిబి.ఆర్.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్నేటి సాక్షి కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 30కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించిన వేతనాలు, ఈఎస్ఐ మరియు పిఎఫ్ బిల్లులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా ఆయన సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు,ఈఎస్ఐ, పిఎఫ్ బిల్లులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని సంబంధిత అధికారులను కోరారు. కార్మికుల జీవన భద్రతకు సంబంధించిన ఈఎస్ఐ, పిఎఫ్ బిల్లులు ఆలస్యం కావడం వల్ల కార్మికులు వైద్య సదుపాయాలు, భవిష్యత్ భద్రత కోల్పోతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్య పరిష్కరించాలని ఆయన కోరారు ఇదే విషయంపైఉన్నతాధికారులు సానుకూలంగా స్పందిస్తూ, కార్మికుల వేతనాలు అలాగే ఈఎస్ఐ, పిఎఫ్ బిల్లులను త్వరలోనే పంపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు డాక్టర్ ప్రవీణ్ కుమార్. తెలిపారు. కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బిఆర్ఎస్ పార్టీ తరఫున నిరంతరం పోరాడతామని, కార్మికులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొని డాక్టర్ ప్రవీణ్ కుమార్.కృతజ్ఞతలు తెలిపారు.

