Wednesday, January 21, 2026

చౌడేపల్లిలో ముక్కోటి ఏకాదశిభక్తిశ్రద్ధలతో సంబరాలు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 30 చౌడేపల్లి మండలంలో ,ముక్కోటి ఏకాదశి సందర్భంగా,వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి.స్థానిక రుక్మిణి సత్యభామ. సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకుడు వశిష్టాచార్యుల ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు ఉత్తర దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించారు.ఉత్తర ద్వారా దర్శన సేవ కార్యక్రమాన్ని చౌడేపల్లికి చెందిన పిల్లారి నాగరత్నమ్మ .గోపాలకృష్ణ .పిల్లారి జీవన్ ప్రకాష్. కుటుంబ సభ్యులు ఉభయ దారులుగా వ్యవహరించారు. అదేవిధంగా సాయంత్రం శ్రీవారి కల్యాణోత్సవానికి భ్రమరాంబ రామిరెడ్డిలు. ఉభయ దారులుగా వ్యవహరించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం కిటకిటలాడింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తర ద్వారా దర్శన సేవ కార్యక్రమం .చేపట్టినందున వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ని దర్శించుకున్నారు. రాత్రంతా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉభయదారులు భక్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News