నేటి సాక్షి డిసెంబర్ 30 తొగుట ప్రతినిధి వడ్డే నర్సింహులు తొగుట మండలం లోని వెంకట్రావుపేట్ లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి,వేణుగోపాల స్వామి ఆలయాలను అందంగా అలంకరించారు.మామిడి తోరణాలు,పూల మాలలతో ముస్తాబు చేశారు. ప్రాతఃకాలం నుండే భక్తులు స్వామి వార్లను ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు.భక్తుల ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయాలు కిట కిటలడాయి.తొగుటకు చెందిన వ్యాపారవేత్త క్యాస సౌజన్య రాజుకుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.వెంకటేశ్వర స్వామి ఆలయానికి కొత్త రంగులు వేసినందుకు వారిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పులిగారి శివయ్య,కల్లేపుభాస్కర్,కల్లేపు నరేష్,ఈదుగల్ల కనకయ్య,ఈదుగల్ల మల్లేశం తదితరులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

