నేటి సాక్షి 30 జూపాడుబంగ్లా:- జూపాడుబంగ్లాలో, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే తోగూరు.ఆర్థర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన వీరాభిమాని & సమాజ సేవకురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమాజ సేవకురాలు టి.షాజహాన్ బేగం, రజక సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి మౌలాలి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు టి.మౌలాలి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుబ్బమ్మ, తదితర నాయకులు, రక్తదాతల ఆధ్వర్యంలో భారీ కేకులు కట్టింగ్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. అనంతరం రక్తదాతలు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. వీరందరికీ వీరాభిమాని టి.షాజహాన్ బేగం పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి కృతజ్ఞతలు తెలియజేసి,అభినందించడం జరిగింది. మన నందికొట్కూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోగూరు.ఆర్థర్ గారి జన్మదిన సందర్భంగా ముందస్తుగా జూపాడుబంగ్లాలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థర్ అభిమానులు 30 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. మహిళలు, ఆర్థర్ అభిమానులు కేక్ కట్ చేసి, ఆర్థర్ కి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం, జిల్లా నాయకులు టి.మౌలాలి లు మాట్లాడుతూ ఆర్థర్ ప్రజల మనిషి అందరిని ఆదరించే వ్యక్తి ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరకాలం బతికే ఉంటాయని చెప్పారు. అలాంటి గొప్ప ఎమ్మెల్యే ఉన్నట్టుగా ఏ ఎమ్మెల్యే ప్రజలకు ఆదరించలేదని ఇలాంటి మంచి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు కోరాలి అని చెప్పారు. ఈ సందర్భంగా రిటైర్డ్ సిహెచ్ఓ మౌలాలి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆర్థర్ వంటి గొప్ప నాయకుడిని ఎన్నటికీ మరువకూడదని మంచి మనసున్న నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్థర్ వీరాభిమానులు, మహిళలు స్వచ్ఛందంగా సంతోషంగా పాల్గొన్నారు. ఇలాంటి మంచి వ్యక్తి అయినా మన ఆర్థర్ జన్మదినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేట్ చేసినవారికి, మరియు అక్షయ బ్లడ్ బ్యాంకు వారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం ధన్యవాదాలు తెలియజేశారు.

