నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి వి. జగదీష్ నీటికి సంబంధించి ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామలైన మైలారం, సంబయ్యపల్లి, గన్నేరువరం గ్రామాలను సందర్శించి ఆయా గ్రామాల నీటి వసతుల గురించి చర్చించడం, ప్లోరైడ్ పరీక్షలు నిర్వహించడం, మిషన్ భగీరథ నీటి సరఫరా రిజిస్టర్ లను పరిశీలించండం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఎ. శ్రీనివాస్ రెడ్డి , మిషన్ భగీరథ, ఇఇ రామ్ కుమార్ ఎంపీఓ శ్రీనివాస్ ఆర్ డబ్ల్యూ ఎస్ ఎఇ యెషశ్రీ ,గన్నేరువరం సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు, సాంబయ్య పల్లి సర్పంచ్ గడ్డం రమ్య,మరియు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొనడం జరిగింది.

