రబీ సీజన్ లో రైతులకు యూరియా సమస్యలు తలెత్తకుండా చూడాలి-రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్నేటిసాక్షి, నల్లగొండ : రబీ సీజన్ లో రైతులకు యూరియా సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ ఆదేశించారు. ఈ రబీ సీజన్ లో రైతులకు యూరియా సరఫరా, యూరియా పై ఏర్పాటు చేసిన “ఫర్టిలైజర్ బుకింగ్ యాప్” పై మంగళవారం ఉదయాదిత్య భవన్ లో ఏర్పాటుచేసిన శిక్షణ సమావేశానికి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. యూరియా కోసం రైతులు గతంలో లాగా క్యూ లైన్ లలో నిలబడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తీసుకువచ్చిన “ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ” రైతులకు ఎంతో సౌకర్యంగా ఉందని తెలిపారు. ఈ యాప్ ద్వారా కూర్చున్న చోటు నుండే ఏ షాపులో ఎంత యూరియా అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చని, అంతేకాక ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉందో వెంటనే తెలిసిపోతుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ వల్ల యూరియా క్రమబద్దీకరణ సైతం చేసుకోవచ్చని, అలాగే ఏ పంటకు ఎంత యూరియా వేయాలో కూడా యాప్ లో అందుబాటులో ఉందని, నల్గొండ జిల్లాలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ విజయవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ ఈ యాప్ పై ఇంకా విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

