నేటి సాక్షి, (డిసెంబర్ 30) ధర్మారం: ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యదశ అతి ముఖ్యమైనదని, ఈ దశలో పిల్లలను ఇటుకబట్టిల్లో ఉంచి వారిని విద్యనుండి దూరం చేయవద్దని, బాల్యన్ని ఇటుకబట్టిల్లో బందీగా మార్చవద్దని ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ అన్నారు. మంగళవారం బడి బయట పిల్లలు (ఓ.ఓ.ఎస్.సి) సర్వేలో భాగంగా మండలంలోని బొమ్మారెడ్డిపల్లి గ్రామంలో పలు ఇటుకబట్టీలను ఆయన సందర్శించి పదిహేను మంది పిల్లలను స్థానిక ధర్మారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. సమగ్ర శిక్షా కార్యక్రమం ద్వారా అందరికీ విద్య మనందరి భాద్యత అనీ, అందరినీ చదివించేలా, జీవితంలో అందరూ ఉన్నంతంగా ఎదిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. మల్లారెడ్డి, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ కొండ కవిత తదితరులు పాల్గొన్నారు.

