నేటి సాక్షి – మెట్ పల్లి*( రాధారపు నర్సయ్య )పేదలకు సాయం చేయడానికి ఫౌండేషన్ సేవలను మరింత విస్తరిస్తామని మెట్ పల్లి సైనిక్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు అరిగెల రాకేష్ పేర్కొన్నారు.మెట్ పల్లి సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రాంతానికి చెందిన పుసులూరి నవ్య అను మహిళ సహకారంతో రోడ్డు పక్కన ఉండే అభాగ్యులకు చలికాలంలో రక్షణగా దుప్పట్లను పంపిణీ చేశారు. అలాగే మరికొన్ని నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అలాగే మెట్ పల్లి పెద్దమ్మ దేవాలయం వద్ద ఉన్న గోశాలకు నెలకు సరిపడా పశుగ్రాసం అందించారు. ఈ సందర్భంగా సైనిక్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు అరిగెల రాకేష్ మాట్లాడుతూ పేదలకు సహాయం చేయాలని ఉద్దేశంతో ఫౌండేషన్ స్థాపించడం జరిగిందన్నారు. ఫౌండేషన్ తో పాటు కొంతమంది ఉదార స్వభావంతో అందిస్తున్న ఆర్థిక సహాయంతో శివ కార్యక్రామాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ సేవలను మరింత విస్తరించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సైనిక్ ఫౌండేషన్ సభ్యులు పోతుగంటి వినోద్, మిట్టపల్లి కార్తీక్, కోయల్కర్ హరీష్, కురుమ శెట్టి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.—

