నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 31, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో బుధవారంఎయిడ్స్ నియంత్రణ సంస్థకు చెందిన సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం రోజున నారాయణపేట జిల్లా, ధన్వాడ మండల పరిధిలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిపి, షుగర్, హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ బి మరియు సి, టీబి మరియు జనరల్ పరీక్షలు నిర్వహించి, నిపుణులైన డాక్టర్లచే మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డా. సత్యప్రకాశ్ రెడ్డి ప్రోగ్రామ్ ఆఫీసర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకమని ఈ క్యాంప్ లో అన్ని రకాల పరీక్షలు చేయించుకొని ఆరోగ్య గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు. అలాగే డా. అనూష, డా.. ముని రహమాన్ డా. అనురాధ గారు & కథలప్ప ఎంపీహెయో మాట్లాడుతూ మన గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ హెల్త్ క్యాంపు కు వచ్చి రక్త పరీక్షలు చేయించుకొని వారి స్థితిని తెలుసుకొనిఉండాలని అందుకు తగినట్టుగా మందులు తీసుకొని ఆరోగ్యంగా తెలియజేశారు. అలాగే మా గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించినందుకు సంపూర్ణ సురక్ష కేంద్రం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్యాంపు ను ఉద్దేశించి ఐ సి టి సి కౌన్సిలర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ హెచ్ఐవి, సిఫిలిస్ తదితర సుఖ వ్యాధుల పట్ల ప్రజలకు అప్రమంతంగా ఉండాలని కోరారు. సంపూర్ణ సురక్ష మేనేజర్ కార్తీక్ కుమార్ మాట్లాడుతూ వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని ఇంతటి దిగ్విజయం చేసినందుకు పిహెచ్సి స్టాఫ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మైక్రో బయాలజీఅనిత ఎన్ సి డి స్టాఫ్ నర్స్ మరియు ల్యాబ్ టెక్నీషియన్స్ నరేష్ ,సత్యనారాయణ రెడ్డి, చరణ్ఎస్., ఎస్ కే ఓ ఆర్ డబ్ల కృష్ణయ్య , మరియ శేఖర్ మరియు పద్మ , ఆశా ఆశ వర్కర్ మరియు, పంచాయతీ సిబ్బంది, గ్రామ యువత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

