నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)…………………………………….. జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ లో శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్ నియమాలు పాటించాలని సీట్ బెల్ట్ ధరించాలని,హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపరాదు అతివేగంగా వాహనం నడపకూడదని మరియు సిగ్నల్స్ పాటించాలని తెలియజేశారు. ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంచుకోవాలని ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి వివరించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి, ఫిరోజ్, జానకిరామ్, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

