నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………….. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బలవంతపూర్ గ్రామ శివారులోని ఆశ్రమంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పవన్ కుమార్ ను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య కేసులో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు,ఒక్కొక్కరికి పదివేల రూపాయలు జరిమానా విధిస్తూ, ఒకటవ అదనపు జిల్లా అండ్ సెషన్స్ జడ్జి నారాయణ తీర్పు వెలువరించారు. నేరం చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

