నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)………………………………………జగిత్యాల భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు, చెట్ల గంగాధర్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల కింద సినీ యాక్టర్ శివాజీ మహిళల వస్త్రాధారణ గురించి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ నా అన్వేషణ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా యాత్రలు చేస్తున్న అన్వేష్ అనే యాత్రికుడు హిందూ దేవతలైన సీతా ద్రౌపదీమాతలను అవమానకరంగా మాట్లాడడమే కాకుండా, దేశాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడటం జరిగిందని,హిందువులందరూ రేపిస్టులని మహిళలను రేపులు చేసే వాళ్లంతా హిందువులేనని చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడని, ఇలాంటి వాడి పాస్పోర్ట్ క్యాన్సల్ చేసి దేశానికి రప్పించి కఠినంగా శిక్షించాలని కోరారు. హిందువులు సంఘటితం కాకపోతే ప్రతి ఒక్కరు ఇలా హిందూ మతం మీద విషం కక్కుతూనే ఉంటారని ఇకనైనా హిందువులు జాగృతం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్,నాయకులు సింగం గంగాధర్, గాదాసు భూమన్న, కొత్తకొండ బాలన్న,ఎడమల వెంకటరెడ్డి,నరేందుల శ్రీనివాస్, బొందుకూరి శ్రీనివాస్, బాశెట్టి ప్రభాకర్,భాశెట్టి దుబ్బ రాజం, పరంకుశం నరేందర్ సిరిపురం గంగారం తదితరులు పాల్గొన్నారు.

