నేటి సాక్షి డిసెంబర్ 31 మంచిర్యాల జిల్లా లో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్వహించరు ఈ సందర్బంగా అయన మాట్లాడుతు ప్రస్తుతం వున్న జిల్లా కార్యవర్గ కమిటీ ని రద్దు చేస్తున్నామని, నూతన కార్యవర్గ కమిటీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని త్వరలోనే జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేస్తామని తెలిపారు,ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం లో తెలంగాణ లో ప్రతిఒక్క జిల్లా కాంగ్రెస్ కమిటీ బలోపేతానికి అధికారి కాంగా అర్హతలున్న నాయకులను జిల్లా లోని కార్యవర్గం లోకి తీసుకోవటం జరుగుతుందని తెలిపారుఇకపై పదవులు పొందిన ప్రతి ఒక్క జిల్లా నాయకులకు బాధ్యతలు అప్పగిస్తామని, వారు వారి బాధ్యతల పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని 2029 పార్లమెంటు ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మంచిర్యాల జిల్లా కార్యవర్గం శక్తి వంచనకు మించి పనిచేయడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా అబ్జర్వర్ గా విచ్చేసిన టిపిసిసి జనరల్ సెక్రెటరీ రహమతుల్లా హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తను నాయకునిగా తీర్చిదిద్దే క్రమంలో వారి యొక్క బాధ్యతలను క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర జిల్లా మండల బ్లాక్ టౌన్ పరిధిలలోని కాంగ్రెస్ పార్టీ పదవులు నియమించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా,నియోజకవర్గ ప్రస్తుత మరియు మాజీ పిసిసి సభ్యులు,మున్సిపల్ కౌన్సిలర్లు,సర్పంచులు,ఎంపీటీసీ, జడ్పీటీసీ,NSUI,యూత్ కాంగ్రెస్,మహిళా కాంగ్రెస్,మండల,బ్లాక్, టౌన్ అధ్యక్షులు,SC, ST,BC, మైనారిటీ,సేవ దళ్,INTUC మరియు అనుబంద సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొని వారి జిల్లా కాంగ్రెస్ పదవుల కోసం దరఖాస్తులను డీసీసీ అధ్యక్షులకు సమర్పించారు.

