Tuesday, January 20, 2026

*మహిళా అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి**మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి**నారి మహిళా ఆరోగ్య సంకల్పం లో భాగంగా సానిటరీ న్యాప్ కిన్స్ పంపిణి*———————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)……………………………………….మహిళా అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్క లంబా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం పట్టన కేంద్రంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నారీ మహిళా ఆరోగ్య సంకల్పం ప్రియదర్శిని ఉడాన్ (సానిటరీ న్యాప్ కిన్ ) కార్యక్రమం లో భాగంగా పట్టణంలోని మహిళలలకు న్యాప్ కిన్స్ ను పంపిణి చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మిదేవేందర్ రెడ్డి గారూ మాట్లాడుతూ నారీ న్యాయ్ కార్యక్రమం ద్వారా మహిళా ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు నాయకత్వంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిలిచిందన్నారు. ఇలా దేశంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వం ద్వారా వచ్చిన నిధులను సద్వినియోగం చేసేందుకు ఉడాన్ ప్రియదర్శిని కార్యక్రమం ద్వారా న్యాప్ కిన్ లను పంపిణి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా సంక్షేమం కు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి పథకాన్ని మహిళా పేరు పైన ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డీకే దక్కిందన్నారు. రాష్ట్రం లో కోటి మంది మహిళలను కోటిశ్వరులను చెయ్యడమే లక్ష్యం గా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజి మంత్రి జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు పొలాస నందయ్య సహకారంతో జిల్లాలో మహిళా కాంగ్రెస్ పటిష్టత దిశగా సమిష్టిగా ముందుకెళ్తామన్నారు. ప్రజలు ముఖ్యంగా మహిళా లోకం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ను ఆదరించి, ఆశీర్వాదం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో మహిళా కాంగ్రెస్ బాధ్యులు నాగ లక్ష్మీ, సంతోషి,మమత, అనిత , అలిశెట్టి మమత తో పాటు మహిళలు తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News