అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా-నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ బి.చంద్రశేఖర్-బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి.చంద్రశేఖర్నేటిసాక్షి, నల్లగొండ : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తానని నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తాను అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బి.చంద్రశేఖర్ కు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు.వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, డిసిసి బ్యాంక్ సీఈవో శంకర్ నాయక్, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, నల్గొండ తహసీల్దార్ మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలికారు.

