Tuesday, January 20, 2026

*గంజాయి సరఫరా మరియు అమ్మకానికి పాల్పడిన ముగ్గురు నిందితులకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు, ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా* *కీలక తీర్పును వెలువరించిన 1st Addl . District & Sessions Judge శ్రీ నారాయణ**గంజాయి పెంపకం, సరఫరా మరియు అమ్మకానికి పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు* . *జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్*—————————————–

నేటి సాక్షి – జగిత్యాల(పూరెళ్ల బాపు)……………………………………గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా మరియు అమ్మకానికి పాల్గొన్న ముగ్గురు నిందితులకు జగిత్యాల జిల్లా మొదటి సెషన్స్ జడ్జి నారాయణ 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.15,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.*నిందితుల వివరాలు:*A1) మారంపల్లి లక్ష్మణ్ S/o నర్సయ్య, వయస్సు 23 సంవత్సరాలు, నివాసం: బాలపల్లి గ్రామం,A2) దొమ్మటి కార్తిక్ S/o శ్రీనివాస్, వయస్సు 24 సంవత్సరాలు, నివాసం: అబ్బాపూర్ గ్రామం, A3) మల్యాల అజయ్ S/o ఎర్రయ్య, వయస్సు 24 సంవత్సరాలు, నివాసం: పెగడపల్లి గ్రామంతేదీ 16-02-2024 రోజున 0p ఇద్దరు వ్యక్తులు బజాజ్ పల్సర్ బైక్ నం. TS11ES 8312 పై నిషేధిత గంజాయిని సరఫరా చేయడానికి వస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌.ఐ సతీష్ తన సిబ్బందితో కలిసి చిల్వకోడూర్ టి జంక్షన్ తనికిలు నిర్వహిస్తుండగా సాయంత్రం 6:00 గంటల సమయంలో, పల్సర్ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఒక నల్లటి బ్యాగ్‌తో రావడాన్ని గమనించి వారిని ఆపే ప్రయత్నం చేయగా, వారు తప్పించుకునేందుకు యత్నించారు. పోలీసుల చాకచక్యంతో వారిని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద ఉన్న నల్లటి బ్యాగ్‌ను పంచాల సమక్షంలో తెరిచి పరిశీలించగా, నాలుగు గోధుమ రంగు ప్లాస్టిక్ ప్యాకెట్లు, ఒక తెల్లటి ప్లాస్టిక్ కవర్‌లో గంజాయి ఉన్నట్లు గుర్తించడం జరిగింది. మొత్తం గంజాయి బరువు 13.282 కిలోలు, దీని విలువ సుమారు రూ.2,65,640/- రూపాయలుగా ఉంది. కేసు విచారణలో సేకరించిన ఆధారాలు, నిందితుల ఒప్పుకోలు, సాక్ష్యాలు ఆధారంగా, న్యాయమూర్తి శ్రీ నారాయణ నిందితులకు 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక్కరికీ రూ.15,000 జరిమానా విధించారు.*ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ* పై కేసు లో నిందితుల చర్యలు చట్టవిరుద్ధమైనవే కాకుండా, సమాజానికి హానికరమైనవిగా పరిగానీచబడిందని కావున గంజాయి వంటి మత్తు పదార్థాల పెంపకం, సరఫరా, విక్రయం వంటి అక్రమ కార్యకలాపాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ,ఇలాంటి నేరాలకు పాల్పడిన వారెవ్వరూ శిక్ష తప్పించుకోలేరని తెలిపారు. యువత చెడు అల్లవాట్లకు , ఇటువంటి అక్రమ వ్యాపారాలకు దూరంగా ఉండి, చట్టాన్ని గౌరవించి సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహారెడ్డి,ఎస్.ఐ సతీష్ ,పి.పి. కే. మల్లేశం గౌడ్ , CMS ఎస్సై ఎస్. శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్ ,CMS కానిస్టేబుల్ రాజు నాయక్,కిరణ్ కుమార్ లను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News