నేటి సాక్షి, తిమ్మాపూర్:తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ నూతన పాలకవర్గాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. వీఓ స్వరూప, సంఘం అధ్యక్షులు ఎల్కతుర్తి మమత నూతన పాలక వర్గాన్ని శాలువాలతో సత్కరించారు. కొత్తపల్లి సర్పంచ్ గోదరి శోభారాణి, ఉప సర్పంచ్ నోముల రాజేష్ గౌడ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

