Tuesday, January 20, 2026

ఎంపీడీవో రామ్ రెడ్డి సేవలు మరువలేనివి- ఉద్యోగులకు పదవి విరమణ తప్పనిసరి – జిల్లా పంచాయతీ అధికారి రవీందర్

నేటిసాక్షి : జగదేవపూర్ డిసెంబర్ 31 జగదేవపూర్ ఎంపీడీవో రామ్ రెడ్డి మండలానికి చేసిన సేవలు మరువలేవని, ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, డిఆర్డిఓ జయదేవ్ ఆచార్యులు పేర్కొన్నారు. మండల ఎంపీడీవో గా పనిచేసిన రామ్ రెడ్డి పదవి విరమణ సభను బుధవారం జగదేవపూర్ లో ఎస్ వి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ జగదేవ పూర్ మండలానికి ఈవోపీఆర్డిగా వచ్చి పదోన్నతిపై ఎంపీడీవో గా ఇతర మండలాల్లో సేవలందించడం జరిగిందని గుర్తు చేశారు. తిరిగి మళ్లీ జగదేవపూర్ మండలానికి ఎంపీడీవో గా రామిరెడ్డి వచ్చారని వివరించారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని పదవి విరమణ తర్వాత విశ్రాంత జీవితం గడపాలని కోరారు అలాగే పంచాయతీ శాఖపై సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. అనంతరం ఎఎంసి చైర్మన్ నరేందర్ రెడ్డి ఎస్సై కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిరంతరం పల్లెల అభివృద్ధి కోసం కృషి చేశారని ఏ గ్రామానికి వెళ్లిన రామిరెడ్డి అందించిన గుర్తుండి పోయేలా బాధ్యతలను నిర్వర్తించారని చెప్పారు. సమయపాలనకు ఎంపీడీవో రామిరెడ్డి చిరునామా లాంటివారని, కిందిస్థాయి అధికారులను, సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా దగ్గరుండి పనిచేసుకునేలా వ్యవహరిం చారని గుర్తు చేశారు. అతని సేవలను జగదేవపూర్ మండల ప్రజా ప్రతినిధులు ఇతర శాఖల అధికారులు ప్రజలు ఎప్పటికీ మరువలేరని తెలిపారు. అనంతరం నూతన సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు, ఇతర శాఖల అధికారులు, కార్యదర్శి, మండల సిబ్బంది ఎంపీడీవో రామిరెడ్డికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తహసిల్దార్ నిర్మల, డిఎల్ పిఓ లత, ఎంపీ ఓ, మొయినుద్దీన్ హౌసింగ్ శాఖ డి ఈ స్రవంతి కవిత ఏఈ విశాఖ, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బాలశంగౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు మునీర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు ఎల్లెష్, రాజు, ప్రకాష్, విద్యాధర్, రజిత మల్లేశం, కనకయ్య, పరమేశ్వర్, కుమార్, రజిత, దీన రాజలింగం, రాజు గౌడ్, మహేష్, సురేష్, బాలయ్య, మహేష్ యాదవ్, లోలోకర్ రెడ్డి, కార్యదర్శులు తిరుపతి, విక్రం, నరేందర్, రామ్ రెడ్డి, రాజగోపాల్, మల్లేశం, నవీన్, నాగరాజు, ఏవో వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News