నేటి సాక్షి 01 జూపాడుబంగ్లా తంగేడంచ :—నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా మండల లోనీ తంగేడంచ గ్రామంలోని ఎన్టీఆర్ పింఛన్ భరోసా, కార్యక్రమం లో తంగేడంచ సర్పంచ్.ఈశ్వర్ రెడ్డి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ . పిక్కిలి శ్రీనివాసులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ని అన్నీ గ్రామాల్లో పింఛన్లు పండగ వాతావరణం నెలకొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సామూహిక పింఛన్లు ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31 రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఏడాది సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయం నుండి సచివాలయ సిబ్బంది తో లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్ళి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పౌస్ పింఛన్ గొల్ల నరసింహులు భార్య కు స్పౌస్ పింఛన్ ల ద్వారా గొల్ల లక్ష్మీదేవికి పెన్షన్ అమౌంట్ ఈశ్వర్ రెడ్డి చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. పిక్కిలి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇది ఊరురా పింఛన్ ల పండుగ లా, సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. తంగేడంచ గ్రామం అవ్వ తాతలను పలకరించి మీకు ప్రతి అవసరతను తీర్చడానికి మన కూటమి ప్రభుత్వం ముందుంది అని భరోసా ఇచ్చారు. గ్రామంలో పర్యటించి సచివాలయ సిబ్బంది తో కలిసి పింఛన్ దారులకు పింఛన్ అందజేశారు. అంతేకాకుండా ప్రజలకు పింఛన్ గురించి కొన్ని అవగాహన కార్యక్రమం లో ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. అందరూ వితంతువు లకు, 4000, వికలాంగులకు, 6000, కూటమి ప్రభుత్వం మీ ఇంటిదగ్గరీ కే తీసుకువస్తున్నారు. కాబట్టి మీరందరూ తప్పకుండా సచివాలయ సిబ్బంది కి సహకరించాలి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో సచివాలయ సిబ్బంది. వెల్ఫేర్ అసిస్టెంట్, సాయి కిరణ్ ఏఎన్ఎం. శ్వేత, మహిళా పోలీస్, కారుణ్య, ఫీచరీస్ హనోకు అగ్రికల్చర్ ప్రసన్న, ఆశలు రాములమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

