నేటి సాక్షి ప్రతినిధి ( సుధాకర్ గౌడ్ ముదేలీ) చేవెళ్ల న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ లో బండారి శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజీ పక్కన శ్రీ హయగ్రీవ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణమై ఐదు సంవత్సరాలు అయినది కానీ భక్తులకు ఎవరికి తెలియకపోవడంతో స్వామివారి దర్శనానికి చాలా తక్కువ మంది వచ్చేవారు ఇటీవల సంవత్సరము నుండి భక్తులకు ఒకరి ద్వారా ఒకరికి తెలియడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు పాల్గొన్న వారిలో కోరుకున్న కోరికలు స్వామివారిని దర్శించుకున్న వారిలో నెరవేరుతున్నాయని తెలియడంతో ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఉత్తర దార దర్శనం చేసుకున్నారు వచ్చిన భక్తులు చాలామంది ఆలయం గురించి ఎవరికీ తెలియకపోవడంతో ఇన్ని రోజులు రాలేకపోయామని అనుకుంటున్నారు స్వామి వారి గుడిలో దర్శనం చేసుకున్న వారిలో స్వామివారి సన్నిధిలో కూర్చొని చాలా ఆనందం పొందినారు స్వామివారి ఆలయంలో ఉన్న పంతులు కూడా భక్తులకు ఆలయ విశిష్ట గురించి స్వామి వారి గురించి భక్తులకు తెలియజేస్తున్నారు . మండలంలో నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు ముక్కోటి ఏకాదశి నాడు ఆనందంతో స్వామివారి దర్శనం పొందినారు

