నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) తిరుపతి డిసెంబర్ 31 : మూడు జోన్లలోని 1800 వాకర్స్ అసోసియేషన్ ల సభ్యులకు ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు అందించి వారి ఆరోగ్య రక్షణ కోసం 15 నుంచి 20% రాయితీతో ఎం ఓ యు చేసుకున్న అత్యాధునిక కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టం ఉన్నట్లు ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి రాజు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుపతిలో వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ రవిరాజు, వాకర్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ కోనేటిరవిరాజు, ట్రేసురర్ మునికృష్ణ యాదవ్ లకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి రాజు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా 40 ఏళ్ల క్రితం పదిమంది సభ్యులతో ఏర్పాటైన వాకర్స్ అసోసియేషన్ నేడు లక్షలాది మంది సభ్యులతో,1800 అసోసియేషన్లతో,ఏడు కోట్ల స్థిర నిధితో అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతుందన్నారు. 90 శాతం పైగా ప్రభుత్వ ఆరోగ్యశ్రీ కార్డులు లేని వృద్ధాప్యంలో ఉన్న వాకర్ సభ్యులకు హెల్త్ కార్డులు అందించి వైద్య సేవలు పొందే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని డివిజన్లోని వాకర్స్ అసోసియేషన్ ల ఐక్యతకు కృషి చేయనున్నట్లు తెలిపారు. బాగా వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకుని విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మౌలిక వసతులు కల్పించే దిశగా వాకర్స్ అసోసియేషన్ లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లైన్స్ క్లబ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర సంస్థలకు ధీటుగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. మీడియా కోఆర్డినేటర్ గా సీనియర్ జర్నలిస్ట్ సుకుమార్ ను నియమించారు. తిరుపతిలో ఏడాది తర్వాత భారీ స్థాయిలో కాన్వకేషన్ సభను 302 జిల్లా గవర్నర్ రామచంద్రారెడ్డి, కన్వెన్షన్ చైర్మన్ ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరిలో గవర్నర్ రామచంద్రారెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం కర్నూలులో నిర్వహించనున్నట్లు తెలిపారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో తమ వంతు కృషి శక్తి వంచన లేకుండా చేస్తామన్నారు. అనంతరం డాక్టర్ రవి రాజు రామచంద్రారెడ్డి ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ కోనేటి రవి రాజు ముని కృష్ణ యాదవ్ గురుస్వామి కృష్ణంరాజు బాబు నాయుడు కొండారెడ్డి డాక్టర్ శ్రీహరి నాయుడు మీడియా కోఆర్డినేటర్ సుకుమార్ లను క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సుబ్రమణ్య రాజు చంద్రలు మెమెంటో అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

