నేటి సాక్షి, అన్నమయ్య మదనపల్లి జిల్లా, శర్మ ÷మదనపల్లి జిల్లా -:- ప్రజల ఆకాంక్ష మేరకు మదనపల్లి జిల్లా కేంద్రంగా అవతరించిందని నూతన అన్నమయ్య జిల్లా మదనపల్లి అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకాంక్షించారు. గురువారం శుభ ముహూర్తంలో వేద పండితుల వివిధ పూజ కార్యక్రమాల నడుమ మదనపల్లి జిల్లా కేంద్రంగా పాలన ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిశాంత్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రజల ఆకాంక్షల మేరకే నూతన అన్నమయ్య జిల్లాగా మదనపల్లి పాలన కేంద్రంగా సాగుతుందని ఈ నూతన జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం నూతన అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి చేతుల మీదగా అధికారికంగా రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమాల నడుమ ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. నూతన కలెక్టరేట్ ఆరంభానికి ముందు కలెక్టరేట్ ఆవరణలో గల స్వాతంత్ర్య సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు సాదర స్వాగతం పలికారు. అనంతరం నూతన జిల్లా కలెక్టరేట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు చేశారు..~~~~~~~~~~~~~~~~~

