నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………..రాష్ట్ర స్థాయిలో సోషల్ సర్వీస్ చేస్తున్న విద్యారంగ ప్రముఖులకు బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డులు అందజేస్తుండగా జగిత్యాలకు చెందిన ప్రిన్సిపాల్ దాసరి రజనీని అవార్డుకు ఎంపిక చేశారు.హైదరాబాద్ లో సెస్ ఆడిటరియంలో గురువారం మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థపకులు దుర్గరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం లో ముఖ్య అతిథిగా సినీ రచయిత, దర్శకులు, తెలుగుబుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ జ్యురి మెంబర్ టివి అశోక్ కుమార్ చేతుల మీదుగా రజనికి అవార్డును అందజేశారు.కార్యక్రమంలో జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు గ్రహీత సౌడాల వెంకట సుబ్బలక్ష్మి, అందే భూమయ్య, ఎక్కల్ దేవి శోభ, నరేష్ యాదవ్, సోడాల ప్రభాకర్ తదితరులు పాల్గొని రజనీని అభినందించారు.*ఈనెల 3న సావిత్రి భాయ్ పూలే అవార్డుల ప్రధానం**పూలే ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దాసరి రజని*సావిత్రిభాయ్ పూలే ఫౌండషన్ ఆధ్వర్యంలో జనవరి 3న రవీంద్ర భారతిలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన, సేవా కార్యక్రమాలు చేస్తున్న పలువురికి అవార్డులు ప్రధానం చేయనున్నట్లు సావిత్రి భాయ్ పూలే ఫౌండషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దాసరి రజని తెలిపారు.టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, మాజీ ఎంపీ వి.హన్మంతరావులు, పూలే ఫౌండేషన్ అధ్యక్షులు మీనగ గోపి లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని రజని వివరించారు.

