Tuesday, January 20, 2026

వైసీపీ శ్రేణులతో సందడి చేసిన ఎర్రాతివారిపల్లె.. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పోటెత్తిన వైసీపీ శ్రేణులు..

నేటి సాక్షి, అన్నమయ్య మదనపల్లి జిల్లా, శర్మ ~అన్నమయ్య జిల్లా -:- మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి లకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు గురువారం మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ సదుం మండల కేంద్రమైన ఎర్రాతివారి పల్లి కు వెళ్లారు. గ్రామానికి చేరుకున్న నిస్సార్ అహ్మద్ పెద్దిరెడ్డి కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువలు కప్పి పూల బొకే అందించి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కోటి మాలై అయ్యప్ప స్వామి వారి ఆలయానికి చేరుకొని పెద్దిరెడ్డి కుటుంబీకులు తలపెట్టిన వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని వేద పండితులచే ఆశీర్వచనం స్వీకరించి తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. దర్శనానంతరం పెద్దిరెడ్డి కుటుంబాన్ని కలిసేందుకు విచ్చేసిన చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, పీలేరు మాజీ చింతల రామచంద్రారెడ్డి, వైసీపీ యువ నాయకులు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి లను కలిసి పుష్పగుచ్చమందించి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి కొద్దిసేపు ముచ్చటించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వివిధ వాహనాల్లో ఎర్రాతివారిపల్లి గ్రామానికి తరిలొచ్చి తమ ఆరాధ్యమైన పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మదనపల్లి నుంచి మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కరిముల్లా, మాజీ ఇరిగేషన్ డైరెక్టర్ దండాల రవి చంద్రారెడ్డి, భీమగానిపల్లి సర్పంచ్ నాగిరెడ్డి, వైయస్ఆర్ సీపీ జనరల్ సెక్రెటరీ అమరనాథ్ రెడ్డి పలువురు వైసీపీ శ్రేణులు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారితో సరదాగా గడిపారు.~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News