నేటి సాక్షి, అన్నమయ్య మదనపల్లి జిల్లా, శర్మ ~అన్నమయ్య జిల్లా -:- రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తరలించిన కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయచోటి ముస్లిం మైనార్టీ నాయకులు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాయచోటి జామియా మస్జీద్ గవర్నమెంట్ సర్కాజీ షర్ఫుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 2వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ అనంతరం తానా సర్కిల్ నుంచి రాయచోటి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కుల, మత, పార్టీలకతీతంగా రాయచోటి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని తహసిల్దార్ కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. లేదా రాయచోటిని కడప జిల్లాలో కలపాలన్న రెండు డిమాండ్లలో ఏదో ఒక నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రెండు డిమాండ్లలో ఏదో ఒకదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాయచోటి మాజీ శాసనసభ్యులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య జిల్లా రావడానికి ఎంతో కృషి చేశారు. ఆయనతోనే అన్నమయ్య జిల్లా సాధ్యమైంది. కానీ కూటమి ప్రభుత్వం పట్టా పంచలు చేస్తూ రాయచోటి కేంద్రాన్ని మదనపల్లికు కలపడంపై తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నామని మా డిమాండ్లను అంగీకరించి కూటమి ప్రభుత్వం తక్షణమే దిగి రావాలని మేము పొందుపరిచిన రెండు డిమాండ్లలో ఏదో ఒకదానికి కూటమి ప్రభుత్వం అంగీకరించి మా రాయచోటి వాసుల నిర్ణయాన్ని స్వాగతించాలని రాయచోటి జామియా మస్జీద్ గవర్నమెంట్ సర్కాజీ షర్ఫుద్దీన్ కోరారు..~~~~~~~~~~~~~~~~~

