నేటి సాక్షి, నారాయణపేట,జనవరి 1,( రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో గురువారం నాడు క్రైస్తవ మతస్థుల ఆధ్వర్యంలో పండగ ను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మరికల్ గ్రామస్తులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరికల్ గ్రామ సర్పంచ్ గుప చెన్నయ్య, చర్చి పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

