నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 1,( ఇమామ్ సాబ్),నూతన సంవత్సరం-2026 సందర్భంగా నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి నూతన సంవత్సరం వేడుకలను కేకు కోసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… నారాయణపేట పోలీసుశాఖ లో ఎన్నో అనుభవాలతో అనుభూతులతో తీపి, చేదు గుర్తులతో 2025వ సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం అనేది కేవలం తేదీ లో మార్పు మాత్రమే కాదు. అది ఎన్నో అనుభవాలను అనుభూతులతో కూడిన జ్ఞాపకం. జిల్లా పోలీసు నూతన సంవత్సర వేల కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాటిని సాధించడానికి అహర్నిశలు కృషి చేయాలని తద్వారా తెలంగాణ పోలీస్ కు, జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. గత సంవత్సరం జరిగిన అనుభవాలను నెమరు వేసుకుంటూ అందులో పాఠాలు నేర్చుకుని, పనితీరు మెరుగుపరుచుకుని అద్భుతమైన ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. గత సంవత్సరం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎలాంటి అవంచనియ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగినందుకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డిఎస్పీ ఎన్ లింగయ్య,సిఐ లు శివ శంకర్, రామ్ లాల్, సైదులు,అఐలు లు నరసింహ, విజయ్ భాస్కర్, ఎస్ఐ లు, డీపీవో సూపర్డంట్ శంకర్ లాల్, స్టాఫ్, ఏస్ బీ స్టాఫ్, డీసీర్బ్ స్టాఫ్, ఆర్మూడ్ రిజర్వు పోలీసులు, ఐటీ కోర్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.

