నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ BRS పార్టీ విధి విధానాలు, ఎమ్మెల్యే గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తలపై చూపుతున్న అభిమానం, ఆప్యాయతకు ఆకర్షితులై ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన MIM పార్టీ సీనియర్ నాయకులు మహ్మద్ సల్మాన్ ఖాన్, మహ్మద్ ఆఫ్జల్, షేక్ నసిర్‌లు BRS పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు తమ నివాసంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, నిస్సార్, ఎత శ్యామ్, చ. రవి, బలరాం నాయక్, జావేద్, అహ్మద్, అమర్ తదితరులు పాల్గొన్నారు.

