నేటి సాక్షి,కొమురం భీమ్ ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సరం–2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి నితిక పంత్ ఐపీఎస్ గారు పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నూతన సంవత్సరంలో ఆరోగ్యం, ఆనందం, సుఖసంతోషాలు మరియు సిరిసంపదలతో ఉండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ప్రజల పట్ల జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించడమే పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు ప్రజల ఆశలు, అంచనాలను అందుకునే విధంగా మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. విధి నిర్వహణలో సమిష్టి కృషితో, ఐక్యతతో పని చేయాలని తెలిపారు.గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాదిలో కూడా సమిష్టి బాధ్యత, అంకితభావంతో ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తూ జిల్లా ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందిని కోరారు. క్రమశిక్షణ, నిబద్ధత, పరస్పర సహకారంతో విధులు నిర్వర్తిస్తే పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ శ్రీ వాహీదుద్దీన్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు, అన్ని పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, ప్రత్యేక బృందాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

