నేటి సాక్షి – జగిత్యాల(పూరెళ్ల బాపు)……………………………………..కొండాపూర్ ప్రాథమిక పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల్ వారి ఆధ్వర్యంలో పాఠశాల లో జరుగుతున్న వినూత్న కార్యక్రమాలను చూసి ఆనందంతో పిల్లలకు డిజిటల్ విధానంలో బోధన అందించాలనే లక్ష్యంతో 43 ఇంచ్ వన్ ప్లస్ టీవీ ని లయన్స్ క్లబ్ మేంబర్ అయినటువంటి శ్రీ గుండేటి మురళి విజయ అందించడం జరిగింది. *జగిత్యాల జిల్లా లయన్స్ క్లబ్ అధ్యక్షులు వడ్లగట్ట శంకర్ మాట్లాడుతూ*విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడం ద్వారా వాళ్లు పోటీ ప్రపంచంలో ముందుంటారని తెలపడం జరిగింది.అదేవిధంగా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి యాగండ్ల సంజన శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీమతి అనుమల లక్ష్మి శంకర్, లయన్స్ క్లబ్ జనరల్ సెక్రటరీ గుండేటి గంగాధర్,కోశాధికారి సామల శ్రీహరి,డీసీఎంసీ T.వినోద్ మరియు కొండాపూర్ లయన్స్ క్లబ్ సభ్యులు గుండేటి కమలాకర్, అను మల్ల ప్రశాంత్, మరిపెళ్లి శీను, గుండేటి రవి ప్రధానోపాధ్యాయులు శ్రీ వేణుగోపాల్, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు రోజా రాణి, వెంకటేష్ , నరేంద్ర, పాఠశాల శ్రేయోభిలాషి CRP చంద్ర శేఖర్,గవిద్యార్థులు,గ్రామస్తులు పాఠశాల శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.అదే విధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల శ్రేయోభిలాషి చంద్రశేఖర్ గారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు దాత అయినటువంటి వడ్లగట్ట శంకర్ గారిని మరియు గుండేటి మురళి విజయ ని, మరియు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ అయినటువంటి శ్రీమతి యాగండ్ల సంజన శ్రీనివాస్ ను శ్రీమతి అనుమల్ల లక్ష్మి శంకర్ ని పాఠశాల తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ శ్రీమతి సంజన శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తను ఎల్లవేళలా కృషి చేస్తానని పాఠశాలకు ఏ అవసరం ఉన్న ఖచ్చితంగా నెరవేరుస్తారని హామీ ఇవ్వడం జరిగింది.

