నేటి సాక్షి, అన్నమయ్య మదనపల్లి జిల్లా, శర్మ ~అన్నమయ్య జిల్లా -:- గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయ పుత్రికగా పేరొందిన వాలంటరీ, గ్రామ సచివాలయాలు రాష్ట్ర ప్రజలకు ఎంత సేవ అందించాయో అందరికీ తెలిసిందే. నెల నెల పెన్షన్ ఇలా వద్దకు పంపిణీ చేసింది వాలంటరీ వ్యవస్థ. ప్రజలకు ఏవైనా పథకాలు కావాలంటే అందించింది సచివాలయ వ్యవస్థ. ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు గడపగడపకు వెళ్లి వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని నెలకు పదివేలు అందిస్తామని మాటిచ్చారు. అప్పటి ప్రభుత్వంలో అన్ని వాలంటరీ వ్యవస్థ కను సైగలోనే నడిచిందని కొందరు టీడీపీ నేతలు వాదించారు. అయినా కూడా కూటమి నేతలు ఒకరిపై ఒకరు వాలంటరీ వ్యవస్థ పై ప్రేమ, కరుణ చూపించారు. తీరా అధికారంలోకి వచ్చాక వాలంటరీ వ్యవస్థ కనుమరుగైంది. అసలు వాలంటరీ వ్యవస్థ పేరు తలిచే నాధుడే లేకుండా పోయారు. కొద్దో గొప్పో సచివాలయ వ్యవస్థ ద్వారా పనులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకుండా సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్నారు. అప్పటి గ్రామ సచివాలయ పేరును కూటమి ప్రభుత్వం మారుస్తూ స్వర్ణ వార్డు గా నామకరణం చేసింది. ఈ మేరకు వార్డు సచివాలయాల పేరును స్వర్ణ వార్డులుగా మార్చే ప్రతిపాదనకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ మార్పు ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ పేరు మార్పుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారికంగా గెజిట్‌ను కూడా విడుదల చేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఈ తాజా మార్పుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల బోర్డులు, అధికారిక రికార్డుల్లో ఇకపై ‘స్వర్ణ వార్డు’ అనే పేరు అమల్లోకి రానుంది. పాలనలో సంస్కరణలు తీసుకొస్తూ, ప్రజలకు చేరువయ్యే క్రమంలో ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసిందని రాబోయే రోజుల్లో మరింత చేరువయ్యేలా వేస్తుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు..~~~~~~~~~~~~~~~~~

