నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)………………………………….. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో జరిగినటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో, జగిత్యాల బాలుర జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కోకో గేమ్ లో ద్వితీయ స్థానం, అథ్లెటిక్స్ విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో ఎన్ హర్షవర్ధన్ గోల్డ్ మెడల్, నీలం విష్ణువర్ధన్ బ్రాంజ్ మెడల్, ఎం.డి షాబిల్ గోల్డ్ మెడల్, కే.సాయి తేజ గోల్డ్ మెడల్, 4*400 మీటర్లు గోల్డ్ మెడల్స్,4*100 మీటర్స్ రిలే లో గోల్డ్ మెడల్స్,లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్,త్రీ కిలోమీటర్స్ రన్నింగ్ లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. దీనికి కళాశాల ప్రిన్సిపల్ ఎన్. మహేందర్ ఫిజికల్ డైరెక్టర్ అంజయ్యను మరియు పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.కళాశాల ఉపన్యాసక బృందం కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్,నవీన్ కుమార్, నిజాముద్దీన్, తిరుపతి, జగన్ మహేష్, జ్యోతి, కళ్యాణి, సరిత, ఇమ్రాన్, అపర్ణ,విజయ్ అభినందించారు.

