నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 2, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ప్రతి కార్యకర్త అన్నదం కావాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వారి నివాసంలో జరిగిన మక్తల్ మున్సిపల్ బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కెసిఆర్ ప్రభుత్వం హాయంలో మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డుల్లో చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలకు వెళ్లాలని వారు సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ఎప్పుడూ లేనివిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. అదే విధంగా మక్తల్ మున్సిపాలిటీని తీసుకొచ్చిన చరిత్ర కూడా బిఆర్ఎస్ పార్టీదాని ఆయన తెలిపారు ఆయా వార్డుల్లో నీ ప్రజలను చైతన్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 మరియు6 గ్యారెంటీలవాగ్దానాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ముఖ్యంగా రైతులకు మహిళలకు యువతకు విద్యార్థులకుచేసిన మోసాలను ఓటర్ల దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన ఉందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ప్రజల దృష్టికి క్షుణ్ణంగా వివరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అయ్యా వార్డుల్లో ఉన్నటువంటి ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి దొంగ ఓట్లు ఉంటే సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన తెలియజేశారు పార్టీ ఆదేశాల అనుగుణంగానే ప్రతి కార్యకర్త నడుచుకోవాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వి నరసింహ గౌడ్ పట్టణ అధ్యక్షుడు జుట్ల చిన్న హనుమంతు ఆయా వార్డులకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

