నేటి సాక్షి తిరుపతి నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం అంబేడ్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ, తిరుపతి జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారి జగదీష్ ని ఆర్ ఎం కార్యాలయంలో కలిసి శాలువాతో సత్కరించి బాబాసాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటాన్ని బహుకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్టార్ కృష్ణ మాట్లాడుతూ ఆర్.ఎం.జగదీష్ నీతి, నిజాయితీ,నిబద్ధతో పనిచేసే క్రమశిక్షణ కలిగిన అధికారి అని, తాము ఆయన నుండి ఎంతో స్ఫూర్తి పొందుతున్నామని కొనియాడారు.సమీప భవిష్యత్తులో మరెంతో ఉన్నత స్థాయి పదవులు అలంకరించాలని స్టార్ కృష్ణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్టార్ కృష్ణ తో పాటు అంబేద్కర్ బహుజన సంఘం నాయకులు వెంకటేష్, శ్రీనివాసులు, రాజశేఖర్, కన్జాక్షి కుమార్, జయంత్ బాబు, మునిశేఖర్, జగన్నాథం తదితరులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

