Tuesday, January 20, 2026

*తండ్రీ బాటలో సేవా , అభివృద్ది కార్యక్రమాల్లో దూసుకుపోతున్న లింగాల నవీన్ గౌడ్*

నేటి సాక్షి 03 లింగాల పాములపాడు :- పాములపాడు మండలం లింగాల గ్రామంలోని టైలర్. వెంకటేశ్వర్లు గౌడ్ ఒక సామాన్య కుటుంబం కానీ ఈయన మనకు దేవుడు ఇచ్చిన వాటిలో ఒకరికి సహాయం చేయాలి అనే దృపథం తో అడుగులు ముందుకు వేస్తుంటారు.ఈయన ఒకప్పుడు లింగాల గ్రామంలోని స్కూల్ లో చైర్మన్ గా విధులు నిర్వహించేవారు అప్పటిలో స్కూల్ కి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు తన సొంత నిధులతో స్కూల్ అభివృద్ధి పనులలో చేయూత అందించడమైనది. కొన్ని సందర్భాల్లో ఈయన తోడ్పాటు కూడా చాలా పనులలో సేవా చేశారు అప్పట్లో టైలర్. వెంకటేశ్వర్లు గౌడ్ సిపీయం పార్టీ లో శాఖ కార్యదర్శి గా కూడా గత 15 సంవత్సరాలు గా కూడా పార్టీ కి కృషి చేయడమైనది.రాజకీయంగాను వ్యక్తి గతం గాను ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరిగింది.అని ఈయన కుమారుడు లింగాల నవీన్ కుమారు గౌడ్ తెలుపడమైనది. తండ్రీ టైలర్. వెంకటేశ్వర్లు గౌడ్, కుమారుడు లింగాల నవీన కుమార్ గౌడ్ కూడా ఆయన తండ్రీ బాటలోనే ముందుకు సాగుతున్నారు. ఒకరికి సహాయం చేయాలని చాల ఆనందం తో మనము ఉన్నది కూడా ఎక్కడైనా కానీ వయసు లో చిన్నవాడైన నవీన్ గౌడ్ ఆలోచనలు సేవా, ఒకరికి సహాయం చేయాలి అనే కోణంలో ఆలోచన ఉన్న వ్యక్తి..లింగాల గ్రామంలోని ఏదైనా కబడ్డీ పోటీలు, కానీ, క్రికెట్ కానీ, బాల్ బాట్మెంటన్ కానీ ఏ విధమైన ఆటల పోటీలు పెట్టిన కానీ ఊరిలో తన వంతుగా ఉన్నదంట్లో కొంత బహుమతులు ప్రధానం చేయడం నవీన్ గౌడ్ కి చాల ఇష్టంగా ఎంచుకున్నాడు.. అంతేకాకుండా పండుగలు జరిగినప్పుడు వినాయక చవితికి చందాలు వసూలు చేసి విగ్రహాలు ఇప్పించడం అయితేనేమి, బోజనాలు పెట్టడం కాని మరియు శివరాత్రి కి మరియు ఉగాది పండుగ సందర్భంగా కన్నడ భక్తులు, శ్రీశైలం వెళ్తూ కాలి నడక వస్తున్న భక్తుల వారికి లింగాల గ్రామంలో తనదైన శైలిలో అన్నదానం తో పాటు పలు సేవా కార్యక్రమాలులో ముందు ఉంటారు. ప్రతి సంవత్సరం ఈడిగ శేషమ్మ జ్ఞాపకార్ధంగా పదవతరగతి వాళ్ళకి పరీక్షలు లో ఫస్ట్, సెకండ్ వచ్చిన వారికి బహుమతులు ప్రధానం చేయడం మరియు ఈ స్కూల్ లో చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏమైనా సహాయం అడిగిన ముందుంటాడు. అంతేకాకుండా లింగాల ఎంపీపీ పాఠశాల కి స్కూల్ లో పిల్లలకు ప్రేయర్ టైం లో కొన్ని మీటింగ్ లలో ఉపాధ్యాయులు చెప్పే మాటలు సరిగా వినపడకపోవడం చూసి నవీన గౌడ్ మైకును స్పీకర్ బాక్స్ ను బహుమతి ఇప్పించడం జరిగిందని లింగాలలో నేను బాల్యం లో స్కూల్ లో చదివాను కాబట్టి నా స్కూల్ అభివృధి చెందితే ఎంతో సంతోషంగా ఉంటుంది అని పిల్లల తల్లి తండ్రులు నాకూ ఒక చిన్న విన్నపం ప్రతి ఒక విద్యార్థి మంచి మార్కులు సాధించాలని మన లింగాల గ్రామము కి మంచి పేరు తీసుకురావాలని మరియు విద్యార్థులు బాగా చదువు కొని మన గ్రామానికి,జిల్లాకి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం లో ఆ ఆనందమే వేరు అని నవీన్ గౌడ్ తెలుపడం జరిగింది. మా కుటుంబం ఒక పేద మధ్య తరగతి కుటుంబం, అయినా నాకు మనసులో ఒకరికి సహాయం చేసే ఆలోచన ఉన్నట్లు మీరు కూడ ఒకరికి సహాయం చేసి ప్రతి ఒక్కరి ఏదో ఒక ఉన్నదంట్లో సహాయపడాలని నవీన్ గౌడ్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News