*నేటి సాక్షి, ఎండపల్లి:* తమ స్నేహితుడు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోయిన విషయం తెలిసిన చిన్ననాటి స్నేహితులు తమకు తోచినవిధంగా సహాయం అందించి ఔదార్యం చాటుకున్నారు. మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పెద్ది కృష్ణ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స నిమిత్తం ఖర్చుల వ్యయం అధికంగా ఉండటంతో బాధితుడి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి కష్ట సమయంలో 2007-2008 విద్యా సంవత్సరంలో కొత్తపేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో 10 వ తరగతి చదువుకున్న సహచర మిత్ర బృందం లోని 15 మంది 10 వేల రూపాయలు పోగు చేసి బాధితుని కుటుంబానికి అందించి పెద్ది కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆప్త మిత్రులు ఆకాంక్షించారు. కలిసి చదువుకున్న సహచర మిత్రులు బాధ్యతతో పాటు ఐక్యతను చాటుకున్నందుకు వారిని పలువురు అభినందిస్తున్నారు.

