నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 2అన్నమయ్య జిల్లా,చౌడేపల్లి మండలంలోని గాంధీవీధికి చెందిన కోలా గౌతమ్ గోసలకురప్పల్లిలో అంద ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.ఆయనకు ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు సరిపోలేదేమో అతను తన కుటుంబ సభ్యుల ద్వారా చిత్తూరు(ప్రస్తుతం అన్నమయ్య)జిల్లా,చౌడేపల్లి మండలం,దిగువపల్లి గ్రామపంచాయతీ,యానాదిపాళ్యం నుండి చిన్నపిల్లలను తక్కువ రేటుకు కొనుకొని శ్రీకాకుళం,విశాఖపట్నం వంటి ప్రాంతాలలో అధిక మొత్తంలో విక్రయాలు జరుపుతున్నారు.గత వారం క్రితం కూడా ఒక ఆడపిల్లను ఒక మహిళ తెచ్చివాళ్ళకు ఇవ్వడంతో చుట్టు ప్రక్కల వాళ్ళు చూడటం,చంటిబిడ్డ లేనిఇంట్లో పిల్లల ఏడుపు వినిపించడం వంటివి గమనించిన చుట్టుప్రక్కల వాళ్ళు వాళ్ళ ఇంటికి తరచుగా వచ్చివెళ్ళే మహిళను విచారించగా నలబైవేలుకు ఆడపిల్లను అమ్మానని,ఇంకో మగపిల్లవాడ్ని సైతం డెబ్బై వేలుకు అమ్ముతున్నట్లు తెలిపింది.వాళ్ళు మాకు ఒక పిల్లవాడు కావాలంటే గాంధీ విధిలో ఉన్న శిల్పా,కుమారమ్మ,గౌతమ్ తో మాట్లాడండి అని చెప్పడం జరిగింది.ఈ విషయం గతవారం పత్రికల్లో వచ్చినది,ఐసిడిఎస్ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళగా పక్కా ప్రణాళికతో పట్టుకోవాలని, స్కెచ్ వేశారు.ఐతే సదరు విక్రయ ముఠా సభ్యులు అనునిత్యం గొడవలు చేస్తుండటంతో సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ(కార్డ్స్) స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పిజిఆర్ఎస్ లో చిన్నపిల్లల విక్రయాల పై పిర్యాదు చేయడం జరిగింది.పిర్యాదు నెంబర్ సిటిఆర్ 20260102972 గా నమోదు చేసి,సదరు సమస్య పరిష్కారం కొరకు యస్.హెచ్.ఓ చౌడేపల్లి వారికి పంపడమైనదని వారు తెలియజేశారు.ఐతే ఈ సమస్య పైన గతంలోనే ఐసిడిఎస్ వారికి తెలియజేయడం జరిగింది.ఐసిడిఎస్ వారు నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.ఐతే ఎటువంటి నిఘాలేనందున శుక్రవారం పిజిఆర్ఎస్ నందు పిర్యాదుచేశామని సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

