*నేటి సాక్షి – జగిత్యాల*రైతులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ ముందుకు వెళ్తుందని SE బి.సుదర్శనం తెలిపారు. అధికారులు నేరుగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి సమస్యలను పరిష్కరించే ‘పొలం బాట’ విజయవంతంగా కొనసాగుతుందన్నారు.సర్కిల్లో 203 కార్యక్రమాలు నిర్వహించి 303 వంగిన స్తంభాలు,1874 లూజ్ లైన్లు, 1349 మధ్య స్తంభాలు ఏర్పర్చామన్నారు. ట్రాన్స్ఫార్మర్లకు సరైన ఎర్తింగ్ కల్పించామన్నారు.___

