నేటి సాక్షి- మేడిపెల్లి* సారంగాపూర్ మండలం , లచ్చక్కపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న యం.డి ఇంతియాజ్, అకాల మరణం పట్ల మేడిపల్లి మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేసింది. నేడు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సంతాప సమావేశంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంతియాజ్, అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన మృతి పట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సహోద్యోగులు మాట్లాడుతూ ఇంతియాజ్, అత్యంత నిబద్ధత గల అధికారి. తన విధి నిర్వహణలో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ, తోటి ఉద్యోగులతో ఎంతో స్నేహభావంతో ఉండేవారు. ఆయన అకాల మరణం మా అందరికీ తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాము.ఈ కార్యక్రమంలో మేడిపల్లి, భీమారం మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అంజుమ, నీరజ, మండల పంచాయతీ కార్యాదర్శుల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ , జనరల్ సెక్రటరీ ప్రశాంత్ , ట్రెజరర్ ఇళయ చంద్ర , మండలంలోని పంచాయతీ కార్యదర్శులు సంతోష్ కుమార్ , మౌనిక , శ్రీనివాస్ ,వాజీద్ , లక్ష్మణ్ ,ఆదిరెడ్డి , కార్యాలయ సిబ్బంది ఇతర ముఖ్యులు పాల్గొని తమ నివాళులర్పించారు.

