నేటి సాక్షి – మెట్ పల్లి*మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో కొండస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.పౌర్ణమి పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు “గోవిందా… గోవిందా…” అనే నామస్మరణతో పాటు భజనలు, కీర్తనలు చేస్తూ కొండస్వామి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రశాంతంగా, శాంతియుతంగా ముగిసినట్లు ఆలయ కమిటీ తెలిపారు. భక్తులు కొండస్వామి ఆశీస్సులు పొందడంతో కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు.___

