*నేటి సాక్షి-మేడిపెల్లి* మహిళ విద్య వికాసానికి సావిత్రి బాయి పూలె చేసిన కృషి చిరస్మనీయం అవమానాలను ఎదురించి అక్షర జ్యోతులు వెలిగించిన ధీశాలి సావిత్రి బాయి, భారతదేశంలో అక్షర విప్లవానికి నాంది పలికిన మహనీయురాలు, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంలో అత్యంత ఘనంగా జరిగాయి. సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజంలో మహిళా విద్య అనే మాటే వినిపించని రోజుల్లో, చీకటి మయమైన జీవితాల్లో వెలుగులు నింపిన జ్ఞాన దీపం సావిత్రిబాయి పూలే,అని ఆయన కొనియాడారు. చదువు అనేది కేవలం ఉద్యోగాల కోసం కాదని, అది మనిషిని స్వతంత్రంగా ఆలోచింపజేసే గొప్ప ఆయుధమని ఆమె నమ్మారని, అందుకే ఎన్ని అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా బాలికలకు విద్యను అందించారని గుర్తు చేశారు.సావిత్రిబాయి కేవలం ఉపాధ్యాయురాలిగానే కాకుండా, సమాజంలోని కుల వివక్షను, అంటరానితనాన్ని రూపుమాపడానికి నిరంతరం శ్రమించిన గొప్ప సామాజిక సంఘసంస్కర్త అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎడ్ల లక్ష్మీ నర్సయ్య,బన్న రాజేందర్, పానుగంటి రాజు, బొడ్డు నరేష్, లింగంపల్లి భరత్, ఎండి మోసిన్, గోడ దాసు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

