నేటి సాక్షి వికారాబాద్:ఎస్ ఎఫ్ ఐ ఆద్వర్యం లో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని విశ్వ భారతి డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా మహనీయురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.తదనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ.”అక్షరమే ఆయుధంగా మహిళ ల విద్య కోసం ,సాధికారత సమాజ మార్పు కోసం పోరాడిన ధీశాలి, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు ,అణచివేతపై అక్షర విప్లవం సృష్టించిన స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే అని . ఆడపిల్లలను తల్లిదండ్రులు జన్మనిస్తే -సావిత్రిబాయి ఫూలే వారి జీవితాలలో వెలుగునిచ్చింది.కులాన్ని, అంటరానితనాన్ని, పేదరికాన్ని దూరం చేసే ఒకే ఒక్క శక్తి, ఆయుధం “చదువు” మాత్రమే అని సావిత్రిబాయి ఫూలే నిరూపించారు .అగ్రకులం లో పుట్టిన ఆడపిల్లకైనా- అంటరానితనంలో పుట్టిన పేద ఆడబిడ్డకైనా ఒకే రకమైన చదవు అందించాలని “మనువాదాన్ని తలదన్ని” మహిళల చదువుల కోసం, హక్కుల కోసం పోరాడిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే ఆడపిల్లను ఇంటి నాలుగోడల మధ్య నుంచి బయటికి రప్పించి ప్రపంచానికి వారి యొక్క శక్తిని, జ్ఞానాన్ని పరిచయం చేయించిన గొప్ప మహిళా సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే.ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ నాయకులు సాయి ,సుదర్శన్ , కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు రాయల్ నవీన్, తదితర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

