నేటి సాక్షి 03 పాములపాడు:- పాములపాడు మండలంలోని, తుమ్మలూరు గ్రామంలో, గ్రామ 2వ సచివాలయము నందు నిర్వహించిన రాజముద్రతో నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య పాల్గొని, ప్రభుత్వ అధికారులతో, నాయకులతో కలిసి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ వైసీపీ హయాంలో జగన్ బొమ్మతో భూమి హక్కు పత్రాలు, సర్వే రాళ్ళు ఉండటం రీ సర్వే కూడా తప్పుల తడకగా ఉండటంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. తాము అధికారంలోకి వస్తే రీసర్వే తప్పులను సరిదిద్ది, ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారనీ, ఆ హామీని ఇప్పుడు నెరవేర్చుతున్నాం అన్నారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు గ్రామస్థాయి లబ్ధిదారులకు చేరాలన్నదే మా నిరంతర కృషి అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్- పఠాన్ బాబు, ఎస్సై- పి.తిరుపాలు, రీ సర్వే డిటి-వి.సుప్రియా, ఆర్ఐ- డి.ఖాజాబి, గ్రామ సర్పంచ్-వి.వరప్రసాద్, ఈఓఆర్డి- ఎం.సులోచన, వీఆర్వో హుస్సేన్ సాహెబ్, తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చెల్లె.హరినాథ రెడ్డి, రామకృష్ణ, ఏసేపు, ఇబ్రహీం, అలిసాహెబ్, వెంకటస్వామి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, మాంద్ర శివానందరెడ్డి పిఎ- మద్దిలేటి, మండల నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

