Monday, January 19, 2026

*నందిమేడారం సర్పంచ్ వీర్‌పాల్‌కు ఘన సన్మానం*• సన్మానించిన కుమ్మర సంఘం పెద్దలు, యూత్ సభ్యులు

నేటి సాక్షి, ధర్మారం (జనవరి 05) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామ కుమ్మర సంఘం, శాలివాహన యూత్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ మ్యాడారం వీర్‌పాల్‌కు సోమవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్ అరిగే రవికుమార్‌, 12వ వార్డు సభ్యురాలు అరుగుల వెంకటమ్మ, 13వ వార్డు సభ్యుడు లింగాల తిరుపతి లను శాలువాలతో సత్కరించారు. అంతరం కేక్ కటింగ్ నిర్వహించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ వీర్‌పాల్ మాట్లాడుతూ… సంఘం సంక్షేమం, అభివృద్ధి పరంగా తమ సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గ్రామ ప్రజలు ఇచ్చిన బాధ్యతను పూర్తి స్థాయిలో, నిజాయితీగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని అన్నారు.గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని సమన్వయంతో పనిచేస్తూ నందిమేడారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం తన బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు. ముఖ్యంగా యువత భాగస్వామ్యంతో గ్రామానికి మంచి భవిష్యత్తును అందించేందుకు కృషి చేస్తానని, విద్య, ఉపాధి అవకాశాలపై యువతను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడతానని వెల్లడించారు. అంతేకాకుండా గ్రామంలో సామాజిక ఐక్యత, శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం పెద్దలు ఆవునూరి ఎల్లయ్య, గంగయ్య, అంజయ్య, యూత్ అధ్యక్షులు ఆవునూరి కిరణ్, ఉపాధ్యక్షులు అంజి, సభ్యులు ఆవునూరి రవీందర్, ప్రశాంత్, అజయ్, అనిల్, మనోహర్, శ్రీకాంత్, మహేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News