నేటి సాక్షి ,నారాయణపేట, జనవరి 5, (రిపోర్టర్ ఇమామ్ సాబ్),గ్రామీణ ప్రాంతాల్లో గల విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబరచాలని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ .సూర్య మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు మరికల్ మండల పరిధిలోని రాకుండ గ్రామంలో విద్యార్థులకు వాలీబాల్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గల విద్యార్థిని విద్యార్థులు చదువులో క్రీడల్లో తమ ప్రతిభను చాటి గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో తమ గుర్తింపును కనబరచాలని ఆయన కోరారు. రాకుండ గ్రామానికి క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు త్వరలోనే క్రికెట్ కిట్టు ఇవ్వడానికి ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మరికల్ ఎస్సై రాములు, రాకుండా గ్రామ సర్పంచ్ గాదం పెద్ద పుల్లయ్య, ఉప సర్పంచ్ నరేష్ రెడ్డి, క్రీడల నిర్వాహకులు జీవరత్నం, మరికల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్, గ్రామం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు, పిటిఈ శ్రీనివాసులు, ఆంజనేయులు రాములు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

