నేటి సాక్షి ,నారాయణపేట , జనవరి 5, (రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలంలోని వివిధ గ్రామాలలో వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకు ప్రభుత్వం ద్వారా యూరియాను అందిస్తామని మరికల్ మండల వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ రహమాన్ అన్నారు. సోమవారం నాడు తీలేరు సింగల్ విండో కార్యాలయం ద్వారా మరికల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు యూనియన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో నాలుగు లారీల యూరియా మండలానికి త్వరలోనే రాబోతున్నదని ఆయన వివరించారు. రైతులకు యూరియా లోటు లేదన్నారు. ప్రస్తుతం తీలేరు సింగల్ విండోలో 900 బస్తాలు అందుబాటులో ఉందన్నారు. వీటిని కూడా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఒక యూరియా బస్తా రూ, 2 61 అన్నారు. మరికల్ మండల రైతులు సింగల్ విందు ద్వారా యూరియాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులను కోరారు. ఈ పంపిణీ కార్యక్రమంలో తీలేరు సింగల్ విండో కార్యాలయం సిబ్బంది కృష్ణ, శ్రీలత, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.

